భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండోరోజు ఆటలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 53/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్(31), క్రేగ్ ఓవర్టన్(1) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఇద్దరూ ఉమేశ్ బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్, కోహ్లీలకు చిక్కారు.
IND Vs ENG: రెండో రోజు లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 139/5 - england vs india 09/02/2021
నాలుగో టెస్టు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగుల వద్ద ఆటను కొనసాగించిన ఇంగ్లీష్ జట్టు.. తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బరిలో దిగిన ఓలీ పోప్(38), జానీ బెయిర్‌స్టో(34) నిలకడగా ఆడుతున్నారు.

IND Vs ENG: రెండో రోజు లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 139/5
దాంతో ఇంగ్లాండ్ 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కానీ తర్వాత నెమ్మదిగా ఆడిన ఓలీపోప్(38*), జానీ బెయిర్‌స్టో(34*) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే తొలి సెషన్ పూర్తయ్యేసరికి 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో ఇంగ్లాండ్ 139/5 స్కోర్‌తో నిలిచింది. భారత బౌలర్లలో ఉమేశ్ మూడు, బుమ్రా రెండు వికెట్లు తీశారు.
ఇదీ చూడండి..కోహ్లీ ఇన్‌స్టా రికార్డు.. ఇండియన్ సెలబ్రిటీల్లో అగ్రస్థానం!