టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఓలీపోప్(74*) శతకం దిశగా సాగుతూ ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ రెండో రోజు రెండో సెషన్ పూర్తయ్యేసరికి 227/7తో నిలిచింది. అతడితో పాటు క్రీజులో క్రిస్‌వోక్స్(4*) ఉన్నాడు.
IND Vs ENG: రెండో సెషన్ పూర్తి.. ఇంగ్లాండ్ 227/7 - ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లైవ్ స్కోర్
ఓవల్ టెస్టు రెండో రోజు రెండో సెషన్ ముగిసింది. తొలిఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆడిన 70 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 227 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓలీ పోప్(74), క్రిస్ వోక్స్(4) ఉన్నారు.
IND Vs ENG: రెండో సెషన్ పూర్తి.. ఇంగ్లాండ్ 277/7
ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆధిక్యం 36 పరుగులుగా నమోదైంది. మూడో సెషన్‌లో భారత్ వీలైనంత త్వరగా మిగతా మూడు వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. ఈ సెషన్‌లో 28 ఓవర్ల ఆట జరగ్గా 88 పరుగులు చేసిన ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో(37) వికెట్ల ముందు దొరికిపోగా జడేజా బౌలింగ్‌లో మొయిన్ అలీ(35)ని రోహిత్ క్యాచ్ అందుకున్నాడు. వీరిద్దరితో పోప్ విలువైన భాగస్వామ్యాలు జోడించాడు.
ఇదీ చూడండి..IND Vs ENG: రెండో రోజు లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 139/5
Last Updated : Sep 3, 2021, 8:54 PM IST