టీమ్ఇండియాతో ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్‌లో ఓడిపోయిన ఇంగ్లాండ్ టీమ్.. టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మోర్గాన్ సేన.. భారత్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత బరిలో దిగిన ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ.. 125 పరుగులే లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో ఛేదించారు.
ఓపెనర్ జేసన్ రాయ్ (49) అర్ధశతకం వరకు వచ్చి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు జోస్ బట్లర్(28) చాహల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ మలన్(24), జానీ బెయిర్‌స్టో(26) నిలకడగా ఆడుతూ.. తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఓవర్లలోనే ఇంగ్లాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో కోహ్లీసేనపై ఘనవిజయం సాధించింది.