తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నై టెస్టు: రోహిత్​ శతకం- అరుదైన రికార్డు - చెన్నై టెస్టులో రోహిత్​ శతకం- 147/3తో భారత్​

ఇంగ్లండ్​తో రెండో టెస్టులో భారత ఓపెనర్​ రోహిత్ శర్మ శతకం సాధించాడు. 130 బంతుల్లోనే సెంచరీ చేశాడు హిట్​మ్యాన్. ఇంగ్లీష్​ జట్టుపై ఇదే మొదటిది.

India opener Rohit Sharma scored a century in the second Test
చెన్నై టెస్టులో రోహిత్​ శతకం- 147/3తో భారత్​

By

Published : Feb 13, 2021, 1:29 PM IST

Updated : Feb 13, 2021, 1:59 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ సెంచరీ చేశాడు. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కేవలం 130 బంతుల్లోనే శతకం సాధించాడు.

మొదటి సెషన్​లో ఎడాపెడా బౌండరీలు బాదిన హిట్​ మ్యాన్​.. రెండో సెషన్​లో కొద్దిగా నెమ్మదించాడు.

ఆ 4 జట్లపై అన్ని ఫార్మాట్లలో 100..

ఇంగ్లీష్​ జట్టు​పై టెస్టుల్లో రోహిత్​కు ఇదే మొదటి సెంచరీ. మొత్తంగా సుదీర్ఘ ఫార్మాట్​ కెరీర్​లో తన ఏడో శతకాన్ని సాధించాడు. ఇవన్నీ స్వదేశంలోనే కావడం విశేషం.

ఈ క్రమంలోనే వెస్టిండీస్​, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్​లపై అన్ని ఫార్మాట్లలో(టెస్టు, వన్డే, టీ20) సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగానూ అరుదైన ఘనత సాధించాడు రోహిత్​.

ఇదీ చదవండి:తొలిసారి 2 వరుస ఇన్నింగ్స్​ల్లో కోహ్లీ క్లీన్​ బౌల్డ్

Last Updated : Feb 13, 2021, 1:59 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details