ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మూడో టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి టీమ్ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పెట్టింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషభ్ పంత్‌లు గులాబీ బంతితో బ్యాటింగ్ సాధన చేస్తున్నారు. జిమ్‌లో వ్యాయామంతో పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండో టెస్టుకు దూరమైన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్‌లు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ గెలువగా.. రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం 1-1తో సిరీస్ సమమైంది. దీంతో మొతేరాలో జరగనున్న పింక్‌బాల్ టెస్టు ఆసక్తికరంగా మారింది.