తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ సేనకు షాక్​.. గాయంతో ఆల్​రౌండర్​ దూరం! - కోహ్లీ సేనకు షాక్​.. గాయంతో ఆల్​రౌండర్​ దూరం

ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​ నుంచి టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్​ నిష్క్రమించాడు. చేతి వేలి గాయం కారణంగా అతడు సిరీస్​ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Ind vs Eng: Washington Sundar ruled out for 6 weeks with finger injury
కోహ్లీ సేనకు షాక్​.. గాయంతో ఆల్​రౌండర్​ దూరం!

By

Published : Jul 22, 2021, 5:18 PM IST

ఇంగ్లాండ్​ సిరీస్​ ముందు టీమ్​ఇండియాను గాయాలు కుదిపేస్తున్నాయి. తాజాగా.. టెస్టు సిరీస్​ నుంచి టీమ్ఇండియా ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్​ తప్పుకున్నాడు. చేతి వేలి గాయం కారణంగా అతడు టోర్నీ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

"వాషింగ్టన్​ సుందర్​ చేతి వేలికి గాయమైంది. దాని నుంచి కోలుకునేందుకు దాదాపుగా 6 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​లో సుందర్​ ఆడే అవకాశం లేద"ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

కాలి గాయం కారణంగా ఇప్పటికే సిరీస్​కు దూరమైన ఓపెనర్​ శుభ్​మన్​ గిల్ మంగళవారం భారత్​ చేరుకున్నాడు. దుర్హమ్​లో జరుగుతున్న వార్మప్​ మ్యాచ్​లో గాయం కారణంగా రిజర్వ్​ పేసర్​ ఆవేశ్​ ఖాన్​ కూడా సిరీస్​ నుంచి నిష్క్రమించాడు. ​అయితే ఈ రిజర్వ్​ పేసర్​పై భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించాల్సి ఉంది. కౌంటీ టీమ్​తో ఆడుతున్న వార్మప్​ మ్యాచ్​ తొలి రోజు ఆవేశ్​ ఖాన్​కు గాయమైన కారణంగా.. అతడ్ని మెడికల్​ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని బీసీసీఐ బుధవారం వెల్లడించింది.

మరోవైపు నడుం నొప్పి కారణంగా వార్మప్​ మ్యాచ్​కు దూరంగా ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో అతడి గాయం ఊహించినంత పెద్దది కాదని తెలుస్తోంది. సౌకర్యవంతంగానే షాట్లు కొడుతున్నాడు. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి టెస్టు నాటికి విరాట్​ పూర్తి స్థాయిలో ఫిట్​నెస్​ సాధిస్తాడని టీమ్​ ఆశిస్తోంది.

ఇదీ చూడండి..భారత్​తో టెస్టు సిరీస్​.. జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

ABOUT THE AUTHOR

...view details