ఇంగ్లాండ్తో జరుగుతోన్న మూడో (పింక్-బాల్) టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే.. టీమ్ఇండియా ఈ మ్యాచ్ తప్పక గెలవాలి.
ఈ సిరీస్లో భాగంగా ఆడిన రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు సిరీస్ను సమం చేశాయి. ఈ మ్యాచ్లో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరుటీమ్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మకు ఇది వందో టెస్టు కావడం విశేషం.
జట్లు:
టీమ్ఇండియా:రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.