హార్దిక్ పాండ్యా.. పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు. ఫినిషర్‌గా టీమిండియాలో అతని పాత్ర కీలకం. గాయాల కారణంగా ఇటీవల భారత జట్టుకు హార్దిక్ కొన్ని నెలల పాటు దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు జట్టులో ఉన్నప్పుటికీ పిచ్‌స్పిన్నర్లకు సహకరించడం వల్ల తుదిజట్టులో అతనికి స్థానం దక్కలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు హార్దిక్ సిద్ధమవుతున్నాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాలని భావిస్తున్నాడు.
గాయం నుంచి కోలుకున్నాక హార్దిక్.. ఎక్కువగా బౌలింగ్ చేయడం లేదు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడినప్పుడూ హర్దిక్ బౌలింగ్ చేయలేదు. చివరిసారిగా నవంబర్‌లో ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో హర్దిక్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సేవలందించేందుకు హర్దిక్ కసరత్తులు చేస్తున్నాడు. ఈ మేరకు ఓ వీడియోను అతడు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇందులో హర్దిక్ బిగ్‌షాట్స్ ఆడుతున్నట్లు, బౌలింగ్‌చేస్తున్నట్లు ఉంది.