భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్టు(IND Vs ENG 5th Test) కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే టీమ్ఇండియా శిబిరంలో కరోనా రావడానికి ప్రధానకారణం కోచ్ రవిశాస్త్రి పుస్తకావిష్కరణకు(Ravi Shastri Book Launch) వెళ్లడమేనని పలు మీడియా కథనాలు రాసుకొచ్చాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అనుమతి లేకుండా కోచ్‌తో పాటు ఇతర ఆటగాళ్లు ఆ ఈవెంట్‌కు వెళ్లారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కోచ్ రవిశాస్త్రితో పాటు మరో నలుగురికి కరోనా సోకడం వల్ల ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటి కథనాలపై కోచ్ రవిశాస్త్రి తొలిసారి స్పందించాడు.
"యూకే అంతటా జీవనం యథావిధిగా సాగుతుంది. ఎక్కడా ఎలాంటి ఆంక్షలు లేవు. ఒకవేళ జరిగితే తొలి టెస్టు నుంచే ఏదైనా అయ్యుండాల్సింది"