ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు ముందు జరిపిన కరోనా పరీక్షల్లో టీమ్ఇండియా ఆటగాళ్లకు నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. భారత శిబిరంలో ఇప్పటికే 5 కొవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో చివరిదైన మాంచెస్టర్ టెస్టు నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం చేసిన టెస్ట్‌ల్లో వైరస్ లేదని తేలినందున.. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఆఖరి టెస్టు యథావిధిగా జరగనున్నట్లు నిర్వహాకులు తెలిపారు.
సిరీస్ కైవసం చేసుకోవాలని..
ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లిన కోహ్లీసేన నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ అదరగొట్టి, సిరీస్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇదే జరిగితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో టెస్టు సిరీస్‌లు నెగ్గిన తొలి భారతీయ కెప్టెన్‌గా కెప్టెన్ కోహ్లీ(Kohli Records) రికార్డు సృష్టిస్తాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేసి, పరువు నిలుపుకోవాలని రూట్‌సేన(England Cricket News) భావిస్తోంది.
నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలిటెస్టు వర్షం కారణంగా డ్రా కాగా.. లార్డ్స్‌లోని రెండో మ్యాచ్‌లో టీమ్ఇండియా 151 పరుగులతో ఘన విజయం సాధించింది. మూడో టెస్టులో.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందగా, ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టులో విజయం సాధించిన భారతజట్టు.. సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇదీ చూడండి..Ind vs Eng: 'ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు అనుమానమే'