ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(47*), కేఎల్ రాహుల్(46) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. జట్టు భారీ స్కోర్ సాధించడానికి గట్టి పునాదులు వేశారు. ఈ క్రమంలోనే అర్ధశతకానికి చేరువైన రాహుల్.. అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ బెయిర్‌స్టో చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం రోహిత్, పుజారా(14) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి సెషన్‌ను పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్ 108/1గా నమోదైంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా లీడ్ 9 పరుగులుగా ఉంది.