తెలంగాణ

telangana

ETV Bharat / sports

James Anderson: మోకాలికి గాయమైనా సరే అండర్సన్ బౌలింగ్ - kohli anderson

ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​పై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గాయమైనా సరే అతడు బౌలింగ్ చేయడం క్రికెట్ అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది. భారత్​తో నాలుగో టెస్టు తొలి రోజులో ఈ సంఘటన జరిగింది.

IND Vs ENG 4th Test: James Anderson bowling with blooded legs
మోకాలికి రక్తం కారుతున్నా బౌలింగ్​ ఆపలేదు!

By

Published : Sep 2, 2021, 9:07 PM IST

టీమ్ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్​ అండర్సన్​కు గాయమైంది. ఆ గాయం వల్ల మోకాలి నుంచి రక్తం వస్తున్నా సరే అతడు బౌలింగ్ చేయడం క్రికెట్​పై ఎంత మమకారం ఉందో ఇదే చూస్తే అర్థం అయిపోతుంది. టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, అజింక్య రహానె బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో ఇది జరిగింది.

అండర్సన్​ మోకాలికి రక్తం

కోహ్లీ-అండర్సన్​ సన్నిహితంగా..

మైదానంలో ఉప్పు, నిప్పులా ఉండే విరాట్​ కోహ్లీ, జేమ్స్​ అండర్సన్​.. నాలుగో టెస్టులో భిన్నంగా కనిపించారు. ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటూ.. లంచ్​ బ్రేక్​ సమయంలో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ పెవిలియన్​​ వరకు నడుచుకుంటూ వచ్చారు.

కోహ్లీతో అండర్సన్​

తొలిరోజు టీమ్​ఇండియా ఇన్నింగ్స్ 22వ ఓవర్​లో అండర్సన్​ బౌలింగ్​ తీరును టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అభినందించాడు. గత టెస్టులో వాగ్వాదానికి దిగిన వీరిద్దరూ ప్రస్తుతం ఆనందంగా కలిసి మాట్లాడుకోవడం వల్ల క్రికెట్ అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. ​

ఇదీ చూడండి..IND Vs ENG: భారత్ తడబాటు.. టీ విరామానికి 122/6

ABOUT THE AUTHOR

...view details