నిర్జీవంగా మారిన పిచ్‌పై బౌలర్లు సత్తాచాటిన వేళ.. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు.. 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయానికి ఆఖరిరోజు 291 పరుగులు చేయాల్సిన ఆతిథ్య జట్టు.. భారత బౌలర్ల ధాటికి 210 పరుగులకు ఆలౌటైంది.
IND Vs ENG: నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం - India vs England Test Series
ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై 157 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.

IND Vs ENG: నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకు ఆలౌట్‌కాగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. రోహిత్ శర్మ శతకంతో సత్తా చాటడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసిన భారత జట్టు ప్రత్యర్థికి 368 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇదీ చూడండి..IND Vs ENG: విజయానికి రెండు వికెట్ల దూరంలో టీమ్ఇండియా