ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో(IND Vs ENG) టీమ్ఇండియా తడబడుతోంది. తొలిరోజు రెండో సెషన్ ముగిసి, టీ విరామ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(50) అర్థశతకంతో అలరించగా.. అంతకుముందు రవీంద్ర జడేజా(10) పేలవ ప్రదర్శనతో వెనుదిరిగాడు. ప్రస్తుతం శార్దుల్ ఠాకుర్(4), రిషబ్ పంత్(4) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు సాధించగా.. జేమ్స్ అండర్సన్, పోప్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా తొలి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ పేసర్లు అండర్సన్, రాబిన్‌సన్, క్రిస్‌వోక్స్ చెలరేగడం వల్ల ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(11), రాహుల్(17)తో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా(4) విఫలమయ్యాడు. తొలుత వోక్స్ రోహిత్‌ను ఔట్‌చేసి ఇంగ్లాండ్‌కు శుభారంభం అందించగా కాసేపటికే రాహుల్, పుజారాలను.. రాబిన్‌సన్, అండర్సన్ పెవిలియన్ పంపారు. దాంతో భారత్ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, కోహ్లీ తర్వాత రహానె రాకుండా జడేజా క్రీజులోకి రావడం గమనార్హం.
కోహ్లీ @ 23,000