రెండో సెషన్‌లో భారత బౌలర్లు విజృంభించారు. వెంట వెంటనే కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. క్రీజులో పాతుకుపోయిన ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ హసిబ్ హమీద్ (63)ని జడేజా క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బ తీశాడు. కొద్దిసేపటికే బుమ్రా ఓలీ పోప్ (2)ని, తర్వాతి ఓవర్లో మొయిన్ అలీ (0) పరుగుల ఖాతా తెరువకుండానే పెవిలియన్‌కి పంపించాడు.
IND Vs ENG: విజయానికి రెండు వికెట్ల దూరంలో టీమ్ఇండియా - India Vs England Scorecard
ఇంగ్లాండ్‌తో జరుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయంవైపు దూసుకెళ్తుంది. ఇంకా రెండు వికెట్లు పడగొడితే మ్యాచ్‌లో గెలుపును సొంతం చేసుకుంటుంది.
IND Vs ENG: విజయానికి చేరువలో భారత్.. టీ విరామానికి ఇంగ్లాండ్ 193/8
వరుసగా వికెట్లు కోల్పోతుండటం వల్ల నిలకడగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న కెప్టెన్ జో రూట్ (36)ను శార్దూల్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. మరో బ్యాట్స్‌మన్ క్రిస్ వోక్స్(18)ను ఉమేశ్ యాదవ్ క్యాచ్ ఔట్ చేశాడు. ఓవర్టన్ (3) పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో రెండు వికెట్లు తీస్తే భారత్ ఘన విజయం లాంఛనమే. మరోవైపు ఇంగ్లాండ్ విజయానికి 175 పరుగుల దూరంలో ఉంది.
ఇదీ చూడండి..కపిల్‌దేవ్ రికార్డును అధిగమించిన బుమ్రా
Last Updated : Sep 6, 2021, 8:49 PM IST