టీమ్ఇండియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. 53 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు.. 290 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. తద్వాతా 99 రన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో క్రిస్ వోక్స్(50) అద్భుతమైన హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు.
53/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ (31), క్రేగ్ ఓవర్టన్ (1) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఉమేశ్ బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్, కోహ్లీలకు చిక్కారు. దాంతో ఇంగ్లాండ్ 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. తర్వాత నెమ్మదిగా ఆడిన ఓలీ పోప్, జానీ బెయిర్‌స్టో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే తొలి సెషన్ పూర్తయ్యేసరికి 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.