ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(22), రోహిత్ శర్మ(20) ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 290 పరుగులకు ఆలౌటైంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఓలీపోప్ (81), క్రిస్‌వోక్స్ (50) అర్ధ శతకాలతో మెరిశారు. జానీ బెయిర్‌స్టో (37), మొయిన్ అలీ (35) కూడా తమవంతు పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్.. భారత్‌పై 99 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో ఉమేశ్ మూడు.. బుమ్రా, జడేజా రెండు వికెట్లు తీయగా శార్దూల్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.