చెపాక్ వేదికగా జరుగుతోన్న భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టుపై.. టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ స్పందించాడు. కోహ్లీ సేన మూడు రోజుల్లోనే ఈ మ్యాచ్ను గెలుస్తుందని జోస్యం చెప్పాడు.
రెండో టెస్టులో గెలుపుపై డీకే జోస్యం - ma chidambaram stadium
చెపాక్ టెస్టులో భారత్ మూడు రోజుల్లోనే విజయం సాధిస్తుందని టీమ్ఇండియా బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ తెలిపాడు. ఇంగ్లాండ్కు తొలి టెస్టు గెలవడానికి ఐదు రోజులు పడితెే.. ఇప్పుడు ఇంగ్లాండ్ మూడు రోజుల్లోనే ఆలౌట్ అవుతుందని అభిప్రాయపడ్డాడు.
![రెండో టెస్టులో గెలుపుపై డీకే జోస్యం Hosts will win the 2nd Test in three days, feels Dinesh Karthik](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10622215-thumbnail-3x2-nsnns.jpg)
రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుంది: డీకే
"తొలి టెస్టు ఐదు రోజుల పాటు కొనసాగింది. 227 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు ఓడింది. కానీ రెండో టెస్టులో పర్యటక జట్టు కేవలం మూడు రోజుల్లోనే పరాజయం మూటగట్టుకుంటుంది" అంటూ డీకే తన ట్విట్టర్లో తెలిపాడు.
ఇదీ చదవండి:క్రికెట్-సినిమా మధ్య 'ప్రేమాయణం' సాగిందిలా!