తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Eng: 'కోహ్లీసేన ఆస్ట్రేలియా బ్రాండ్‌ క్రికెట్‌ ఆడుతోంది' - india vs england 4th test 2021

కోహ్లీసేన(Team India News).. ఆస్ట్రేలియా బ్రాండ్ క్రికెట్ ఆడుతోందని అన్నాడు ఇంగ్లాండ్ సహాయ కోచ్ పాల్ కాలింగ్​వుడ్(Paul Collingwood). లార్డ్స్​ టెస్టులో భారత్, ఇంగ్లాండ్(Ind vs Eng) మధ్య పోరు గట్టిగా సాగిందని పేర్కొన్నాడు. మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమ్‌ఇండియా తర్వాతి మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్నా.. అందుకు తగ్గట్టే సన్నద్ధమౌతున్నామని తెలిపాడు.

team india
టీమ్​ఇండియా

By

Published : Sep 1, 2021, 12:22 PM IST

కఠినంగా అనిపించినా.. టీమ్‌ఇండియా(Team India News) మాత్రం ఆస్ట్రేలియా బ్రాండ్ క్రికెట్‌ ఆడుతోందని ఇంగ్లాండ్‌ సహాయ కోచ్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ అంటున్నాడు. లార్డ్స్‌ టెస్టులో రెండు జట్లు(Ind vs Eng) నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయని పేర్కొన్నాడు. కోహ్లీ(Virat Kohli) అత్యంత భావోద్వేగంతో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడని వెల్లడించాడు. జో రూట్‌ ఇలాగే తన ఫామ్‌ కొనసాగిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

"లార్డ్స్‌ టెస్టు నువ్వా నేనా అన్నట్టు సాగింది. రెండు జట్లు దాదాపుగా విజయానికి దగ్గరయ్యాయి. ఒక్క అవకాశాన్నీ కూడా వదిలేయొద్దన్నట్లు రెండు జట్లు పట్టుదల ప్రదర్శించాయి. ఎందుకంటే ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్నప్పుడు గెలుపు వారికి అత్యంత కీలకం. అందుకే ఈ మ్యాచ్‌ అద్భుతం. ఏదేమైనా మేం ఫలితానికి మరో వైపు నిలిచాం. కానీ, రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించాయి"

--కాలింగ్‌వుడ్‌, ఇంగ్లాండ్ సహాయ కోచ్.

'ఆస్ట్రేలియా తరహా ప్రవర్తన, వారి క్రికెట్‌ కాలం గడిచే కొద్దీ మారుతున్నాయి. కాస్త కఠినంగా అనిపించినా టీమ్‌ఇండియా మాత్రం ఆస్ట్రేలియాలా కనిపిస్తోంది. విరాట్‌ అద్భుతమైన ఆటగాడు. ఎంతో భావోద్వేగంతో జట్టును నడుపుతున్నాడు. ఇంగ్లాండ్‌ జట్టుగా మేం మా నిర్ణయాలపై దృష్టిపెడతాం. భారత్‌ చేస్తున్న దానిపై, తీసుకుంటున్న నిర్ణయాలపై మేం దృష్టి నిలపం. వారి నిర్ణయాలు వారిష్టం. మేమేం తీసుకుంటామో అదే మాకు కీలకం. వాటిద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టడం అవసరం' అని కాలింగ్‌వుడ్‌(Paul Collingwood) తెలిపాడు.

'మైదానంలో మేమెలా ప్రవర్తిస్తామన్నదే మాకు ముఖ్యం. కొన్ని సంక్లిష్ట నిర్ణయాలు తీసుకొని మేం టీమ్‌ఇండియాపై ఒత్తిడి పెంచాలని అనుకుంటున్నాం. మా పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ప్రతి సిరీసుకు సన్నద్ధమవుతాడు. అతడికి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఆ వయసు వారికి వరుసగా మ్యాచులు ఆడటం కష్టమే. కానీ, అతడు మాత్రం సూపర్‌ ఫిట్‌గా ఉన్నాడు. ఇక జో రూట్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బంతిని చక్కగా చూస్తూ ఆడుతున్నాడు. సిరీస్‌ సాంతం అతడిలాగే ఆడతాడని మా విశ్వాసం' అని వుడ్‌ పేర్కొన్నాడు.

మా ప్లాన్స్​.. మాకున్నాయి..

మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమ్‌ఇండియా తర్వాతి మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్నా.. అందుకు తగ్గట్టే సన్నద్ధమౌతున్నామని ఇంగ్లాండ్‌ సహాయక కోచ్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ అన్నాడు. నాలుగో టెస్టుకు(India vs England 4th test 2021) ముందు నిర్వహించిన వర్చువల్‌ మీడియా సమావేశంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. గత మ్యాచ్‌లో ఘోర బ్యాటింగ్‌ వైఫల్యంతో భారత బ్యాట్స్‌మెన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారని, దాంతో రాబోయే టెస్టులో బలంగా పుంజుకునే అవకాశం ఉందని కాలింగ్‌వుడ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే తాము కూడా సిద్ధంగా ఉంటామని చెప్పాడు.

"రెండో టెస్టులో మేం అద్భుతమైన బౌలింగ్‌ చేశామని అనుకుంటున్నా. మీరు టీమ్‌ఇండియా వీరాభిమాని అయితే ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ను విమర్శించడంలో ఆశ్చర్యంలేదు. కానీ, తొలిరోజు ఆ పిచ్‌పై బంతి అనూహ్యంగా తిరిగింది. వికెట్‌పై తేమ ఉండటంతో ఇంగ్లాండ్‌ బౌలర్లు రెచ్చిపోయారు. దాంతో బ్యాట్స్‌మెన్‌కు ఆడటానికి కష్టమైంది. మ్యాచ్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లాండ్‌ బౌలర్లను మెచ్చుకున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడం వల్లే భారత బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందులు పడ్డారని చెప్పాడు. ఇప్పుడు నాలుగో టెస్టులో ఆ జట్టు బలమైన పోటీ ఇస్తుందా అని అడిగితే.. కచ్చితంగా ఇస్తుందనే మేం అనుకుంటున్నాం. అందుకు తగ్గట్టు సన్నద్ధమౌతున్నాం. టీమ్‌ఇండియా ఎంత నాణ్యమైన జట్టో మా అందరికీ తెలుసు. తర్వాతి మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు పూర్తిస్థాయిలో రాణిస్తారనే నమ్ముతున్నాం. అలాంటప్పుడు మేం కూడా సిద్ధంగా ఉంటాం" అని కాలింగ్‌వుడ్‌ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి:Ind Eng Test: విహారికి అవకాశం దక్కేనా?

ABOUT THE AUTHOR

...view details