తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అశ్విన్​ లేకపోతే ఓటమిని కొని తెచ్చుకున్నట్లే' - మైఖేల్​ వాన్​

ఓవల్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ స్పిన్నర్​ అశ్విన్​ను ఎంచుకోకపోవడంపై సోషల్​మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశ్విన్​ లాంటి గొప్ప ఆటగాడికి ఆడే అవకాశం ఇవ్వకపోవడం వాళ్ల పిచ్చితనమే అంటూ ఇంగ్లాండ్​ మాజీ క్రికెట్​ మైఖేల్​ వాన్​ ట్వీట్​ చేశాడు.

Former Cricketers On Ravichandran Ashwin's Non-Inclusion In 4th Test
నాలుగో టెస్టులోనూ అశ్విన్​కు మొండిచేయి- అది పిచ్చితనమే!

By

Published : Sep 2, 2021, 7:46 PM IST

ఇంగ్లాండ్​తో మూడో టెస్టు ఓటమి తర్వాత నాలుగో టెస్టులో కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో జట్టులో రెండు మార్పులు చేసింది. ఉమేశ్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి రాగా.. ఇషాంత్‌, మహ్మద్‌ షమికి విశ్రాంతినిచ్చారు. అలాగే ఈ మ్యాచ్‌లోనైనా సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని ఆశించినా అదీ జరగలేదు. అతడిని మరోసారి రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేసి జడేజాను తీసుకోవడం గమనార్హం.

అశ్విన్​ లాంటి స్టార్​ స్పిన్నర్​ను భారత తుదిజట్టులోకి ఎంచుకోక పోవడంపై సోషల్​మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు అశ్విన్​కు ఆడే అవకాశం ఇవ్వకపోవడంపై స్పందించారు. ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ మైఖేల్​​ వాన్​ స్పందిస్తూ.. "ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ రవిచంద్రన్​ అశ్విన్​ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 413 వికెట్లు.. 5 సెంచరీలు సాధించిన అద్భుతమైన ఆటగాడికి ఆడే అవకాశం ఇవ్వకపోవడం వారి పిచ్చితనమే!" అని ట్వీట్​ చేశాడు.

"మరోసారి అశ్విన్​ను పక్కనపెట్టేశారంటే నమ్మలేకపోతున్నా. ఇంగ్లాండ్​ పిచ్​లు స్పిన్​కు అనుకూలించేవి. కానీ, ఈ జట్టును నమ్మలేకపోతున్నా. మీరు ఐదుగురు ఉత్తమ బౌలర్లను ఎంచుకున్నా.. అందులో అశ్విన్​కు చోటు కల్పించాల్సింది. అతడితో పాటు షమీకి విశ్రాంతి కల్పించడం వల్ల ఓటమిని కొని తెచ్చుకున్నట్లే అనిపిస్తుంది".

- శశీ థరూర్​, కాంగ్రెస్​ అగ్రనేత

టీమ్ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​.. చివరిగా న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో ఆడాడు. ఆ మ్యాచ్​లో అశ్విన్​.. 29 పరుగులు నమోదు చేసిన నాలుగు వికెట్లను పడగొట్టాడు. అయినా.. ఆ మ్యాచ్​లో టీమ్ఇండియా ఓడిపోయింది.

ఇదీ చూడండి..IND Vs ENG: లంచ్​ విరామానికి టీమ్​ఇండియా 54/3

ABOUT THE AUTHOR

...view details