తొలి టెస్టు రెండో రోజు చివరి సెషన్లో వరుస వికెట్లు తీసుకున్న ఇషాంత్ శర్మను ప్రశంసించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. 'అద్భుతమైన బౌలింగ్' అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
మొదటి టెస్టులో ఐదు సెషన్ల పాటు వికెట్ లేకుండా కొనసాగిన ఇషాంత్.. రెండో రోజు చివరి సెషన్లో జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్లను వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 525 వద్ద 8 వికెట్లు కోల్పోయింది.
170 ఓవర్ల పాటు వికెటు దక్కకుంటే.. ఓ బౌలర్‌కు అది జైలు శిక్ష లాంటిదనే చెప్పాలి. చివరి స్పెల్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో జట్టును పోటీలో నిలిపాడు. చివరి సెషన్లో ఇషాంత్ ప్రదర్శన ప్రశంసనీయం.