అహ్మదాబాద్ వేదికగా టీమ్ఇండియాతో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లో ముగియడంపై ఇంగ్లాండ్ మాజీలు పిచ్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మొతేరా పిచ్‌పై ఇంగ్లాండ్ మాజీ కోచ్ మార్క్ రాబిన్సన్ స్పందించాడు. ఏ సిరీస్ అయినా ఆతిథ్య జట్టుకే ఎక్కువ ప్రయోజనమని అన్నాడు. దీంతో టీమ్ఇండియాకు అనేక విధాలుగా అది కలిసొచ్చిందని తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టులోని రొటేషన్ విధానంపై వస్తున్న విమర్శలపై రాబిన్సన్ మాట్లాడాడు. ఆ విశేషాలు మీకోసం..
నాలుగో టెస్టులో గెలిచేందుకు ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా మద్దతు ఇవ్వడంపై మీరేమంటారు?
సిరీస్‌లోని ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు టీమ్ఇండియాను ఓడిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చేరుకునేందుకు ఆస్ట్రేలియాకు అవకాశం వస్తుంది. కానీ, నా ఉద్దేశం ప్రకారం వారు నిజంగా ఇంగ్లాండ్‌కు మద్దతు ఇస్తారు అని నేను అనుకోను.
చివరిటెస్టులో ఇంగ్లాండ్ తుది జట్టు గురించి?
ఈ పరిస్థితిలో తుది జట్టును ఊహించడం చాలా కష్టం. మూడో టెస్టులో సీమర్లకు అవకాశం ఇచ్చారు. పేసర్లదే పైచేయి అనుకున్నాం. కానీ, ఎవ్వరూ ఊహించనట్టుగా స్పిన్నర్లకు కలిసొచ్చింది. కాబట్టి నాలుగో టెస్టుకు జట్టును ఎంపిక చేసే ముందు పిచ్ గురించి ఆలోచిస్తారు. పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంచుకుంటారని ఆశిస్తున్నా.
ఇంగ్లాండ్ జట్టు పునరాగమనంపై మీ సమాధానం?