భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు రెండో రోజున ఆతిథ్య జట్టు నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ 68 ఒవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం డేవిడ్ మలాన్ 27(49) , జో రూట్ 14(14) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్‌లు నిలకడగా ఆడి జట్టుకు కీలక భాగస్వామ్యాన్ని అందించారు. రోరీ బర్న్స్ 61(153), హమీద్ హసీబ్ 68(195) పరుగులు చేశారు. అయితే షమి వీరి భాగస్వామ్యాన్ని పడగొట్టాడు. 49వ ఓవర్లో షమి వేసిన బంతికి రోరీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మలాన్‌తో కలిసి హసీబ్ భాగస్వామ్యం నిర్మించసాగాడు. కానీ జడేజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యి హమీద్.. పెవిలియన్ బాటపట్టాడు.