చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ పట్టుబిగించింది. 555/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించిన ఆ జట్టు.. 578 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్, నదీమ్ తలో రెండు వికెట్లు సాధించారు.
తొలి టెస్టు: 578 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ - chidambaram stadium
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది. మూడో రోజు మరో 23 పరుగులు జోడించి రూట్ సేన చివరి రెండు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు.

578 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్
మరో 10.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టెయిలెండర్లు మరో 23 పరుగులు చేశారు. డొమినిక్ బెస్ (34, 105 బంతుల్లో 4x6).. 567 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరుగగా.. అండర్సన్‌ను అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఇదీ చదవండి:'చివరి సెషన్లో ఇషాంత్ బౌలింగ్ అద్భుతం'
Last Updated : Feb 7, 2021, 11:01 AM IST