ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో(India Vs England) నాలుగో టెస్టు సందర్భంగా భారత కోచ్ల బృందంలో కరోనా కేసులు(Corona in Indian Team) కలకలం రేపాయి. ఆ పరిస్థితుల్లో కోచ్ల బృందం మినహా శిబిరంలోని వారందరూ కరోనా నెగెటివ్ రావడం వల్ల ఆ మ్యాచ్కు ఆటంకం కలగలేదు. అయితే ఐదో టెస్టుకు(IND Vs ENG 5th Test) ముందు జట్టులోని జూనియర్ ఫిజియోకూ కొవిడ్ సోకడం వల్ల మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అంతకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI President) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. చివరి మ్యాచ్ నిర్వహణ అనుమానంగానే ఉందంటూ పేర్కొన్నాడు. అయితే గురువారం ఆటగాళ్లకు చేసిన కొవిడ్ పరీక్షల్లో అందరికి కరోనా నెగెటివ్ రావడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు నిర్వహణకు ఎలాంటి అడ్డులేదనే అంతా అనుకున్నారు.
అయితే మ్యాచ్ జరగాల్సిన రోజు(శుక్రవారం) రానే వచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ మ్యాచ్ రద్దు అని తొలుత ఈసీబీ(ECB News) ప్రకటించింది. ఆ తర్వాత ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమంటూ బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. ఆ తర్వాత ఇరుజట్లు కలిసి చర్చించి.. ఐదో టెస్టును సరైన సమయంలో తిరిగి నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఎలాంటి చర్చ జరిగిందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే భారత్, ఇంగ్లాండ్ చివరి టెస్టుకు(Manchester Test) ముందుకు జరిగిన పరిణామాలను ఓసారి చర్చిద్దాం.
ఏం జరిగిందంటే?