తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇంగ్లాండ్​-బీపై గెలిచినందుకు  శుభాకాంక్షలు' - pink ball test

చెన్నై టెస్టులో గెలుపొందిన భారత జట్టుకు అభినందనలు తెలిపాడు ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్​మన్ కెవిన్​ పీటర్సన్. తమ టీమ్​ను ఇంగ్లాండ్​-బీ అని చురకలు అంటించాడు. రెండో టెస్టులో అద్భుతంగా రాణించిన మొయిన్​ అలీని మూడో టెస్టుకు పక్కకు పెట్టడంపై.. ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డును విమర్శించాడు.

Congratulations India for beating England B: Pietersen gets cheeky
'ఇంగ్లాండ్​-బీపై గెలిచిన ఇండియాకు శుభాకాంక్షలు'

By

Published : Feb 16, 2021, 8:02 PM IST

రెండో టెస్టులో గెలుపొందిన టీమ్​ఇండియాకు ఇంగ్లాండ్​ మాజీ బ్యాట్స్​మన్ కెవిన్ పీటర్సన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఇంగ్లాండ్-బీ జట్టుపై విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు అని వ్యంగంగా పేర్కొన్నాడు.

"ఇంగ్లాండ్​-బీ జట్టుపై విజయం సాధించిన ఇండియా జట్టుకు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు.

చెన్నై టెస్టులో ఆల్​రౌండర్​​ ప్రదర్శన చేసిన మొయిన్​ అలీని మూడో టెస్టుకు పక్కన పెట్టడంపై పీటర్సన్​ విస్మయం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్​ అండ్​ వేల్స్​ క్రికెట్​ బోర్డుపై విమర్శలు గుప్పించాడు. బలమైన జట్టుపై ఆడుతున్నప్పుడు రొటేషన్​ పాలసీని కొనసాగించడం వింతగా ఉందని తెలిపాడు.

'2005లో ఆస్ట్రేలియాపై అద్భుత సిరీస్​ విజయం సాధించాం. తద్వారా దేశంలో క్రికెట్​పై ఆదరణ పెరిగింది. ప్రస్తుత సిరీస్​ ద్వారా ఆటపై ఇష్టం తగ్గుతుంది. ఒక టెస్టు ఆడిన తర్వాత మొయిన్​ అలీ స్వదేశానికి వస్తున్నాడు. అద్భుతం' అంటూ కెవిన్​ ఆశ్చర్యంగా తెలిపాడు.

'బలమైన జట్టుపై టెస్టు మ్యాచ్​ గెలవాలంటే మంచి టీమ్​ను ఎంపిక చేయాలి. కానీ, మీరలా చేయట్లేదు అంటూ' కెవిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మూడో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే..

అహ్మదాబాద్​ వేదికగా జరుగనున్న మూడో టెస్టుకు తమ జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్​ బోర్డు. వికెట్​ కీపర్​ జానీ బెయిర్​ స్టో, పేసర్​ మార్క్​ వుడ్​ను జట్టులోకి తీసుకోనున్నారు.

రొటేషన్​ పాలసీలో భాగంగా మొయిన్​ అలీని స్వదేశానికి పంపనున్నామని ఇంగ్లిష్​ బోర్డు ప్రకటించింది. జేమ్స్​ అండర్సన్, జోఫ్రా ఆర్చర్​లు ఈ పింక్​ బాల్​ టెస్టుకు అందుబాటులో ఉంటారని వెల్లడించింది.

జట్టు:

జో రూట్​(కెప్టెన్​), జేమ్స్​ అండర్సన్​, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్​ స్టో, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్​, రోరీ బర్న్స్​, జాక్​ క్రావ్లే, డాన్​ లారెన్స్​, జాక్​ లీచ్, ఒల్లీ పోప్​, డామ్ సిబ్లీ, బెన్ స్టోక్స్​, ఒల్లీ స్టోన్, క్రిస్ వోక్స్​, మార్క్​ ఉడ్​.

ఇదీ చదవండి:ఆస్ట్రేలియన్​ ఓపెన్​ సెమీస్​లోకి సెరెనా

ABOUT THE AUTHOR

...view details