రెండో టీ20లో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న కోహ్లీసేన.. మూడో టీ20లోనూ సత్తాచాటి సిరీస్‌పై పట్టు సాధించాలని ఊవిళ్లూరుతోంది. కెప్టెన్ కోహ్లీతో పాటు యువ ఆటగాళ్లూ రాణిస్తున్న వేళ టీమ్ఇండియా శిబిరంలో సరికొత్త జోష్ కనపడుతోంది. ఇదే ఉత్సాహంతో మూడో టీ20లోనూ విజయం సాధించాలని.. భారత జట్టు వ్యూహాలకు పదునుపెడుతోంది.
మొతేరాలో టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మూడో టీ20కు ఎర్రమట్టి పిచ్‌ను తయారు చేయనున్నారని తెలుస్తోంది. ఈ మ్యాచ్ మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.
రోహిత్‌కు ఛాన్స్!
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ అర్ధశతకంతో అలరించగా.. కెప్టెన్ కోహ్లీ తనదైన మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్ అవ్వడంపై అభిమానులు కలవరానికి గురయ్యారు. తొలి టీ20లోనూ రాహుల్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. అతడి స్థానంలో రెండు మ్యాచ్‌ల్లో విశ్రాంతినిచ్చిన రోహిత్ శర్మకు మూడో టీ20లో ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు పంపే అవకాశం ఉంది.
మరోవైపు.. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లతో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. అటు బౌలింగ్‌లోనూ మార్పు ఉండకపోవచ్చు.