తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అలా ఔట్​ అవ్వడం దురదృష్టకరం' - chepak test

చెన్నై టెస్టులో తాను ఔట్​ అయిన విధానంపై భారత సీనియర్​ బ్యాట్స్​మెన్​ ఛెతేశ్వర్​ పుజారా స్పందించాడు. అద్భుతంగా బ్యాటింగ్​ చేసినప్పటికీ.. దురదృష్టం తనను వెంటాడిందని అభిప్రాయపడ్డాడు.

Cheteshwar Pujara reacted to the way he was caught out in the first Test.
'అలా ఔట్​ అవ్వడం దురదృష్టకరం'

By

Published : Feb 8, 2021, 7:58 AM IST

చెన్నై టెస్టులో తాను ఔటైనా విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​ ఛెతేశ్వర్​ పుజారా. తొలి ఇన్నింగ్స్​లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కీలక సమయంలో ఆదుకున్న ఈ నయా వాల్​.. డామ్​ బెస్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​ అయ్యాడు.

అప్పటికే అర్ధసెంచరీ(73 పరుగులు) చేసి ఊపు మీద కనిపించిన పుజారా.. సెంచరీ చేరువయ్యాడు. స్పిన్నర్ బెస్​ వేసిన బంతిని బ్యాక్​ఫుట్​పై ఫుల్​షాట్​ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి షార్ట్​లెగ్​లో ఉన్న పోప్​కు తగిలి గాల్లోకి ఎగిరింది. దాన్ని షార్ట్​ మిడాన్​లో ఉన్న బర్న్స్​ ఒడిసి పట్టాడు. దీంతో ఆశ్చరపోవడం పుజారా వంతైంది.

"అలా మాత్రమే ఔట్​ అయ్యే అవకాశం ఉన్నట్లుంది. నేను అద్భుమైన షాట్లు ఆడాను. బంతిని సరిగానే అంచనా వేశాను. నా బ్యాటింగ్​లో ఎలాంటి టెక్నికల్​ పొరపాట్లు లేవు. అయినప్పటికీ ఒక బ్యాట్స్​మెన్​గా అంతకుమించి చేయడానికి ఏమీ లేదు. ఇలా జరగడం దురదృష్టకరం" అని పుజారా తెలిపాడు.

జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు రిషభ్​పంత్​తో కలిసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు పుజారా. 'పంత్​తో కలిసి ఆడటాన్ని ప్రేమిస్తాను. అతని బ్యాటింగ్​ పట్ల సంతోషంగా ఉంది. రిషభ్​ ఇంకొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. సెంచరీ చేసే అవకాశాలను కోల్పోతున్నాడు. దీన్ని నుంచి అతడు నేర్చుకుంటాడని నమ్ముతున్నాను' అని నయావాల్​ తెలిపాడు.

ఇదీ చదవండి:'టోర్నీ నిర్వహణలో భారతీయుల పాత్ర కీలకం'

ABOUT THE AUTHOR

...view details