భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టుకు సర్వం సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
ఆ రికార్డులేంటి?
- కెప్టెన్ విరాట్ కోహ్లీ(kohli runs in test cricket) మరో పరుగు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 23వేల పరుగులు చేసిన ఫాస్టెస్ట్ బ్యాట్స్మన్గా రికార్డుకెక్కుతాడు.
- హిట్మ్యాన్ రోహిత్ శర్మ(rohit sharma runs) మరో 22 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 15వేల పరగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.
- పేసర్ జస్ప్రిత్ బుమ్రా(bumrah wickets in test) మరో మూడు వికెట్లు తీస్తే టెస్ట్ ఫార్మాట్లో వంద వికెట్లు తీసిన ఘనతను అందుకుంటాడు.
- మహ్మద్ షమీ(mohammed sh wickets in test).. మరో ఐదు వికెట్లు పడగొడితే టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరతాడు.