టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా.. చెపాక్ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కు దిగలేదు. మొదటి రోజు బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డ అతని స్థానంలో రిజర్వ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మైదానంలోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో తొలి రోజు బ్యాటింగ్ చేస్తుండగా పుజారా కుడిచేతికి గాయమైంది. ఆ తర్వాత నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో అతడు ఫీల్డింగ్‌కు దిగలేదు అని స్పష్టం చేసింది.