డేనైట్ టెస్టులపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా? గులాబి బంతితో ఆడే విషయంలో ఆటగాళ్లు తమ ఇబ్బందిని తెలియజేసిన నేపథ్యంలో బోర్డు ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు అనంతరం.. గులాబి బంతితో ఆడటంలో తమ ఇబ్బందుల గురించి బోర్డుకు ఆటగాళ్లు విన్నవించినట్లు తెలిసింది.
"పిచ్‌పై పడిన తర్వాత బంతి ఒక వేగంతో వస్తుందని బ్యాట్స్‌మెన్‌కు అంచనా ఉంటుంది. ఎర్ర బంతితో వాళ్లు అలాగే ఆడటానికి అలవాటుపడ్డారు. కానీ గులాబి బంతి వారు ఊహించని వేగంతో రావడం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదే కాదు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతిని చూడడంలో సమస్య కూడా వారి ఆందోళనకు మరో కారణం."