Ind Vs Eng: టీమ్ఇండియాలో మరొకరికి కరోనా.. ఐదో టెస్టు డౌటే - Ravi Shastri
16:06 September 09
జూనియర్ ఫిజియో యోగేశ్ పరమార్కు పాజిటివ్
టీమ్ఇండియా కోచ్ బృందానికి కరోనా సోకిన తర్వాత మరో పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ జూనియర్ ఫిజియో యోగేశ్ పరమార్కు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి. దీంతో ఐదో టెస్టుకు ముందు జరగాల్సిన ప్రాక్టీస్ ఆగిపోయింది. దీంతో ఐదో టెస్టు నిర్వహణ సందేహంగా మారింది.
ప్రాక్టీస్ నిలిచిపోయిన కారణంగా టీమ్ఇండియా ఆటగాళ్లందరూ తమ గదులకు చేరుకున్నారు. ఇప్పటికే ప్రధానకోచ్ రవిశాస్త్రితో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో 2-1తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది.
ఇదీ చూడండి..మెంటార్‌గా ధోనీ.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు