తెలంగాణ

telangana

ETV Bharat / sports

మిగిలిన టీ20​ల్లో అ​భిమానులకు నో ఎంట్రీ - ఇండియా vs ఇంగ్లాండ్​ టీ20 సిరీస్​

భారత్​, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మిగిలిన మూడు టీ20లకు ప్రేక్షకులను అనుమతించబోమని గుజరాత్​ క్రికెట్​ అసోసియేషన్​ సోమవారం ప్రకటించింది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో ఖాళీ స్టేడియంలోనే మిగిలిన మ్యాచ్​లను నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

All the up coming India vs England T-20 matches will be played without audience
మిగిలిన టీ20​ల్లో అ​భిమానులకు నో ఎంట్రీ

By

Published : Mar 15, 2021, 10:39 PM IST

అహ్మదాబాద్​ వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య జరగనున్న సిరీస్​లో మిగిలిన మూడు టీ20​లకు అభిమానులను అనుమతి లేదని గుజరాత్​ క్రికెట్​ అసోసియేషన్(జీసీఏ) స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్​కు అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్డేడియం వేదికైంది. ఇప్పటికే జరిగిన రెండు టీ20ల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించగా.. మిగిలిన మూడు మ్యాచ్​లకు ఖాళీ స్టేడియంలోనే నిర్వహిస్తామని(జీసీఏ) వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details