ఇంగ్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించింది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ). స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.
"నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 సిరీస్ కోసం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించాం. కొవిడ్ నిబంధనలను ప్రేక్షకులు విధిగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం. టీ20 సిరీస్ టికెట్లను ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నాం. ఇప్పటికే 50 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి".