తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిమాని గుండుపై ఆటోగ్రాఫ్​ చేసిన క్రికెటర్​ - అభిమానికి గుండుపై ఆటోగ్రాఫ్​ ఇచ్చిన క్రికెటర్

Jack Leach Autograph: యాషెస్​ సిరీస్​లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ మధ్య జరిగిన నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆటోగ్రాఫ్​ అడగగా.. ఇంగ్లాండ్ ఫీల్డర్​ జాక్​ లీచ్​ ఓ ఫ్యాన్​ గుండుపై సంతకం చేసి నవ్వులు పూయించాడు.

England Spinner Jack Leach Signs Autograph
అభిమానికి గుండుపై ఆటోగ్రాఫ్​ ఇచ్చిన క్రికెటర్​

By

Published : Jan 6, 2022, 12:27 PM IST

Jack Leach Autograph: సాధారణంగా ఆటోగ్రాఫ్​ను చెయ్యి, పుస్తకం లేదా ఇతర వస్తువులపైనా చేస్తారు. కానీ ఓ క్రికెటర్​​ మాత్రం ఓ అభిమాని గుండుపై సంతకం చేసి నవ్వులు పూయించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

ఎవరంటే?

యాషెస్​ సిరీస్​లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ మధ్య జరిగిన నాలుగో టెస్టు తొలి రోజు ఆట బుధవారం జరిగింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు.. ఇంగ్లాండ్ ఫీల్డర్​ జాక్​ లీచ్​ను ఆటోగ్రాఫ్​ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో బౌండరీ లైన్​ వద్ద ఫీల్డింగ్​ చేస్తున్న జాక్​​.. ఓ అభిమాని గుండుపై సంతకం చేసి నవ్వులు పూయించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. ఈ దృశ్యం నెటిజన్లను, అక్కడి అభిమానులను విపరీతంగా నవ్వించింది. ఈ దృశ్యాలను స్టేడియంలో లైవ్​స్క్రీన్​ మీద కూడా ప్రదర్శించారు. ఆ ఫన్నీ మూమెంట్​ మీరూ చూసేయండి..

ఇదీ చూడండి: ఈ స్విమ్మర్​ ఈదితే రికార్డ్​.. ఇక నవ్విందంటే..

ABOUT THE AUTHOR

...view details