ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న యాషెస్ సిరీస్‌కు(ashes 2021 ) జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. మొత్తం 17మంది సభ్యులతో కూడిన జట్టులో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ మినహా దాదాపు అందరూ సీనియర్ ఆటగాళ్లే ఉన్నారు(ashes england squad).
కరోనా కారణంగా ఆస్ట్రేలియాలో కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలపై తొలుత ఇంగ్లాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకానొక దశలో అసలు యాషెస్ జరుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం ఇరు దేశాల బోర్డులు చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ల కుటుంబాలకు తగిన వసతులు ఏర్పాటు చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా.
మానసిక అనారోగ్యం, చేతి వేలికి గాయం కారణంగా ఆగస్టులో టీమ్ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. టీ20 ప్రపంచకప్‌కు కూడా అందుబాటులో ఉండనని చెప్పేశాడు. ఈ నేపథ్యంలో యాషెస్‌లో కూడా స్టోక్స్ ఉండడని అందరు ముందే ఊహించారు. మరోవైపు సామ్ కరెన్, జోఫ్రా ఆర్చర్లు గాయాల కారణంగా తప్పుకున్నారు.