తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: ఐపీఎల్​కు ఇంగ్లాండ్​ ప్లేయర్స్ అంతా​ దూరం.. కారణమిదే! - eng vs pak t20 series

ఐపీఎల్​ 2021(IPL 2021) రెండో దశకు ఇంగ్లాండ్​ క్రికెటర్లందరూ దూరం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జానీ బెయిర్​ స్టో, డేవిడ్ మలన్ సహా పలువురు ఐపీఎల్​ నుంచి తప్పుకున్నారు.

england players
ఇంగ్లాండ్ ఆటగాళ్లు

By

Published : Sep 14, 2021, 10:26 AM IST

ఐపీఎల్​(IPL 2021 News) రెండో దశ నుంచి ఇప్పటికే పలువురు ఇంగ్లాండ్ క్రికెటర్లు వైదొలిగారు. అయితే.. ప్లే ఆఫ్స్​ సమయానికి మిగతా ఇంగ్లాండ్​ ఆటగాళ్లు కూడా ఐపీఎల్​ నుంచి తప్పుకోనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయా జట్లకు ఇది ఇబ్బందికర విషయంగా మారనుంది.

కారణమిదేనా?

యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్​కు ముందు ఇంగ్లాండ్​ జట్టు పాకిస్థాన్​తో టీ20 సిరీస్​ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్​ కోసం ఇంగ్లాండ్(IPL England Players)​ ఆటగాళ్లందరూ ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​కు దూరం కానున్నట్లు సమాచారం.

మరోవైపు.. ఇటీవలే మాంచెస్టర్​ వేదికగా జరగాల్సిన భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు(Ind vs Eng 5th Test) కరోనా కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్ల మధ్య మనస్పర్థలు వచ్చాయి! ఈ కారణంగానే మెగాలీగ్​కు దూరమవ్వాలని ఇంగ్లీష్​ ఆటగాళ్లు నిర్ణయించుకున్నారని ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెయిర్​ స్టో, డేవిడ్​ మలన్​ ఈ ఐపీఎల్​కు పూర్తిగా దూరమయ్యారు. ఇంగ్లాండ్​కు చెందిన జార్జ్​ కార్టన్​ మాత్రం టీ20 వరల్డ్​కప్​కు ఎంపికకానందున ఐపీఎల్​ ముగిసేవరకు ఆడనున్నాడు. ఇతడు ప్రస్తుతం ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఐపీఎల్​ 2021 గ్రూప్​ స్టేజ్​ అక్టోబర్ 8న ముగియనుంది. ఆ తర్వాత రోజే ఇంగ్లాండ్​(England vs Pakistan) ఆటగాళ్లు పాకిస్థాన్​ ప్రయాణం కానున్నారట! అక్టోబర్ 14, 15న రెండు మ్యాచ్​ల టీ20 సిరీస్​ జరగనుంది.

ఐపీఎల్​ రెండో దశ సెప్టెంబరు 19నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో​ చెన్నై సూపర్​ కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ తలపడనున్నాయి.

ఇదీ చదవండి:

ఐపీఎల్ 2021: వారు వైదొలిగారు.. వీరు వచ్చారు!

IPL 2021: ఐపీఎల్​ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు

రాజస్థాన్​కు షాక్​.. ఐపీఎల్​కు బట్లర్​ దూరం

ABOUT THE AUTHOR

...view details