England head coach Silverwood sacked: యాషెస్ సిరీస్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కారణంగా జట్టు ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌ను పదవి నుంచి తొలగించింది ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). ఆస్ట్రేలియా గడ్డపై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-4తో దారుణమైన ఓటమిని చవిచూసింది రూట్ సేన. అంతకుముందు జట్టు డైరెక్టర్ ఆష్లే గైల్స్‌ను కూడా పదవి నుంచి తప్పించింది ఈసీబీ.
ఇంగ్లాండ్ కోచ్‌గా ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా సిల్వర్‌వుడ్ అన్నారు. గడిచిన రెండేళ్లు సవాలుతో కూడినవని చెప్పారు. ఇంగ్లాండ్ త్వరలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. మార్చి 8న ఈ పర్యటన ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి: