తెలంగాణ

telangana

ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్.. వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు

england vs netherlands
england vs netherlands

By

Published : Jun 17, 2022, 6:56 PM IST

Updated : Jun 17, 2022, 7:29 PM IST

18:53 June 17

చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్.. వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు

నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో ఇంగ్లాండ్​ చరిత్ర సృష్టించింది. 498/4 పరుగులతో వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. దీంతో ఇంగ్లాండ్ తన రికార్డు తానే తిరగరాసుకుంది. అంతకుముందు కూడా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లాండ్ పేరిటే ఉంది. 2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ చేసిన 481 పరుగులే ఇప్పటివరకు అత్యధికం.

మూడు వన్డేల సిరీస్​ కోసం నెదర్లాండ్స్​లో పర్యటిస్తోంది ఇంగ్లాండ్​. శుక్రవారం అమ్​స్టెల్వీన్​ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఈ అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్​లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​కు రెండో ఓవర్​లోనే షాక్​ తగిలింది. ఓపెనర్​ జేసన్ రాయ్​ ఒక్క పరుగుకే బౌల్డ్​ అయ్యాడు. మరో ఓపెనర్​తో సాల్ట్​తో (122) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు డేవిడ్ మలన్ (125). ఈ క్రమంలోనే ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు. వీరు పెవిలియన్​ చేరిన అనంతరం కెప్టెన్ ఇయాన్​ మోర్గాన్​ డకౌట్​గా వెనుదిరిగాడు. అయితే అప్పటికే క్రీజులో ఉన్న బట్లర్​తో (70 బంతుల్లో 162) కలిసి నెదర్లాండ్​ బౌలర్లకు చుక్కలు చూపించాడు లివింగ్​స్టోన్ (22 బంతుల్లో 66). దీంతో నాలుగు వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్​ 498 పరుగులు చేసింది.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 జట్లు

  • ఇంగ్లాండ్​ 498/4- నెదర్లాండ్స్​పై
  • ఇంగ్లాండ్ 481/6- ఆస్ట్రేలియాపై
  • ఇంగ్లాండ్ 444/3- పాకిస్థాన్​పై
  • శ్రీలంక 443/9- నెదర్లాండ్స్​పై
  • దక్షిణాఫ్రికా 439/2- వెస్టిండీస్పై
  • దక్షిణాఫ్రికా 438/9- ఆస్ట్రేలియాపై
  • దక్షిణాఫ్రికా 438/4- భారత్​పై
  • ఆస్ట్రేలియా 434/4- దక్షిణాఫ్రికాపై
  • దక్షిణాఫ్రికా 418/5 - జింబాబ్వేపై
  • భారత్ 418/5 - వెస్టిండీస్​పై
Last Updated : Jun 17, 2022, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details