తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమ్ఇండియా ఆటగాళ్లు అదెప్పుడు నేర్చుకుంటారో?' - kohli bairstow dispute

IND vs ENG Test: భారత్, ఇంగ్లాండ్‌ ఐదో టెస్టులో విరాట్‌ కోహ్లీ - జానీ బెయిర్‌స్టోల మధ్య జరిగిన మాటల యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పేసర్​ జేమ్స్​ అండర్సన్​. భోజన విరామ సమయంలో బెయిర్‌స్టో తన వద్దకు వచ్చి 'వాళ్లు ఇంకెప్పుడు స్లెడ్జింగ్‌ చేయకుండా ఉండటం నేర్చుకుంటారో..?' అని అన్నాడని చెప్పాడు.

ind vs eng
ind vs eng

By

Published : Jul 10, 2022, 7:17 AM IST

IND vs ENG Test: భారత్, ఇంగ్లాండ్‌ ఐదో టెస్టులో విరాట్‌ కోహ్లీ - జానీ బెయిర్‌స్టోల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో (106, 114 నాటౌట్‌) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాది ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, అతడు తొలి ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తున్న వేళ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ ఒకరినొకరు ఏవో మాటలు అనుకున్నారు. అంతలోనే అంపైర్లు కలగజేసుకొని దాన్ని అక్కడితో ముగించారు. అయితే, వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదే విషయంపై తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ స్పందించాడు. ఆ రోజు వాళిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయాన్ని బెయిర్‌స్టో తనతో చెప్పాడని అండర్సన్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పాడు.

'బెయిర్‌స్టో ఆరోజు భోజన విరామానికి ముందు సుమారు 80 పరుగుల వద్ద ఉన్నాడు. అప్పటికే కోహ్లీ చాలా సేపటి నుంచి ఏదో అంటూ అతడిని స్లెడ్జింగ్‌ చేస్తున్నాడు. అయితే, మీరు గమనించారో లేదో.. కోహ్లీ స్లెడ్జింగ్‌ చేయకముందు బెయిర్‌స్టో స్ట్రైక్‌రేట్‌ 20గా ఉండేది. అతడు స్లెడ్జింగ్‌ చేశాక 150కి చేరింది' అని అండర్సన్‌ పేర్కొన్నాడు. అలాగే భోజన విరామ సమయంలో బెయిర్‌స్టో తన వద్దకు వచ్చి 'వాళ్లు (టీమ్‌ఇండియా ఆటగాళ్లు) ఇంకెప్పుడు స్లెడ్జింగ్‌ చేయకుండా ఉండటం నేర్చుకుంటారో..?' అని అన్నాడని చెప్పాడు. కాగా, బెయిర్‌ స్టో ఆ మ్యాచ్‌లో నిజంగానే కోహ్లీతో వాగ్వాదం జరిగాక చెలరేగిపోయాడు. అంతకుముందు 61 బంతుల్లో 13 పరుగులే చేసిన అతడు తర్వాత 79 బంతుల్లో 93 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఫాలో ఆన్‌లో పడకుండా బెయిర్‌స్టో ఆ జట్టును కాపాడాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జోరూట్‌ (142 నాటౌట్‌)తో కలిసి ఏకంగా మ్యాచ్‌నే గెలిపించాడు.

ఇదీ చదవండి:టీ20ల్లో రోహిత్​ మరో రికార్డ్​.. భారత్​ నుంచి ఒకే ఒక్కడు

ABOUT THE AUTHOR

...view details