లార్డ్స్ టెస్టులో చారిత్రక విజయాన్ని అందుకున్న టీమ్ఇండియా.. మూడో టెస్టుకు సన్నద్ధమవుతోంది. ఈ సమయంలో ఇంగ్లాండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ రెండో టెస్టు గురించి మాట్లాడాడు. భారత్ తమ జట్టును వెనక్కి నెడితే.. తామూ అంతే దీటుగా వారిని వెనక్కి నెడతామని అన్నాడు.
లార్డ్స్ టెస్టు చివరిరోజు సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటలు ఎక్కువయ్యాయని సిల్వర్‌వుడ్ చెప్పాడు. అయితే వీటిని మ్యాచ్ గెలుపునకు ఉపయోగించాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. రెండో టెస్టులో తమ కుర్రాళ్లు గెలిచేవాళ్లని తెలిపాడు. టీమ్ఇండియా ఓటమి తప్పించుకునే ఆశతోనే చివరి రోజు ఆటను మొదలుపెట్టిందని సిల్వర్‌వుడ్ అన్నాడు. అయితే ఆఖర్లో వచ్చిన జస్ప్రీత్ బుమ్రా-మహమ్మద్ షమి ద్వయం మ్యాచ్‌ని మలుపు తిప్పిందని తెలిపాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఇంగ్లాండ్ ఆటగాళ్లు భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.