లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ భారీ సెంచరీతో (180; 321 బంతుల్లో) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 391 పరుగులకు ఆలౌటైంది. రూట్ ఇన్నింగ్స్‌కు తోడు బెయిర్ స్టో (57; 107 బంతుల్లో), రోరీ బర్న్స్ (49; 136 బంతుల్లో) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో సిరాజ్ 4, ఇషాంత్ శర్మ 3, షమీ 2 వికెట్లతో రాణించారు.
IND vs ENG: ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యం.. 391 ఆలౌట్ - ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్
లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 391 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. కెప్టెన్ రూట్ భారీ సెంచరీతో మెరుగైన ప్రదర్శన చేశాడు. బెయిర్ స్టో హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ 3, సిరాజ్ 4 వికెట్లతో మెరిశారు.
ఇండియా vs ఇంగ్లాండ్
314/5తో టీ విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్ చివరి సెషన్లో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. మొయిన్ అలీ- రూట్ జోడీ ఆరో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను ఇషాంత్ శర్మ విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సామ్ కరన్‌ను మరుసటి బంతికే పెవిలియన్ పంపాడు ఇషాంత్. మరికాసేపటికే రాబిన్సన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు సిరాజ్.