ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత క్యాచ్‌తో అదరగొట్టాడు. కళ్లు చెదిరే రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టి ప్రత్యర్థి బ్యాటర్‌ను అడ్డుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంగ్లాండ్ టాపార్డర్ కుప్పకూలిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు మొయిన్ అలీ. అతడైనా జట్టును ఆదుకుంటాడని భావిస్తే.. పదో ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. మరక్రమ్ బౌలింగ్‌లో బంతిని అలీ గాల్లోకి లేపగానే.. స్టబ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దూసుకువచ్చాడు.
గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. అసాధ్యమనుకున్న క్యాచ్‌ను విజయవంతంగా అందుకుని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. సంచలన క్యాచ్‌తో మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి అత్యుత్తమ క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరు అని పేర్కొంది. కాగా, ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా మాత్రం స్టబ్స్ విఫలమయ్యాడు. 4 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
అయితే, మొదటి టీ20 మ్యాచ్‌లో మాత్రం అతడి అద్భుత ఇన్నింగ్స్‌ను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో స్టబ్స్ 28 బంతుల్లోనే రెండు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు.
మ్యాచ్ సాగిందిలా.. సౌతాంప్టన్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ హెండ్రిక్స్‌కు(70 పరుగులు) తోడు మరక్రమ్ అజేయ అర్ధ శతకంతో రాణించడంతో ప్రొటిస్ భారీ స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బట్లర్ టీమ్‌కు దక్షిణాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా తబ్రేజ్ షంసీ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనం శాసించాడు. దీంతో 16.4 ఓవర్లకే ఇంగ్లాండ్ కథ ముగిసిపోయింది. 90 పరుగుల తేడాతో మూడో టీ20లో గెలిచి.. దణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జానీ బెయిర్‌స్టో 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రొటిస్ బౌలర్ షంసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఇదీ చూడండి: 'గోల్డ్ గెలిచేశావ్గా.. ఇప్పుడు దర్జాగా సినిమా చూసుకో అచింత!'.. మోదీ ట్వీట్