ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final)కు ముందు న్యూజిలాండ్ ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు. తొలి టెస్టులో చూపుడు వేలుకు గాయం కావడం వల్ల రెండో టెస్ట్‌కు స్పిన్నర్ శాంటర్న్ పక్కకు తప్పుకోగా.. కెప్టెన్ విలియమ్సన్(Williamson) కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మోచేతి గాయంతో బాధపడుతున్న కివీస్ సారథి విలియమ్సన్ పరిస్థితిని వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని ఆ జట్టు ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్(Gary Stead) తెలిపాడు. రూట్ సేనతో తుది టెస్టుకు అందుబాటులో ఉండేది లేనిది బుధవారం ప్రకటిస్తామన్నాడు. గురువారం నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు ప్రారంభం కానుంది.