ఇంగ్లాండ్ పర్యటనలో విజయవంతం కావాలంటే తనకు సీనియర్ల సలహాలు తప్పనిసరి అని తెలిపాడు కివీస్ యువ ఆల్‌రౌండర్ కైల్ జేమిసన్. ఇంగ్లాండ్‌లో తొలిసారి పర్యటిస్తున్న కైల్.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, నెయిల్ వాగ్నర్, బ్రాస్‌వెల్ వంటి బౌలర్ల నుంచి అనుభవాలను పంచుకోవాలని భావిస్తున్నాడు.
"టిమ్, వాగ్స్, బ్రాస్‌వెల్, హెన్రీ వంటి సీనియర్ బౌలర్ల సలహాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వీరికి ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉంది. ఇక్కడి పిచ్‌లు, వాతావరణ పరిస్థితుల పట్ల వారికి అపారమైన అనుభవం ఉంది. డ్యూక్స్ బంతులతో ఎలా బంతులేయాలి.. అనే విషయాలను త్వరలోనే వారి నుంచి నేర్చుకుంటాను."