తెలంగాణ

telangana

ETV Bharat / sports

Eng vs Ind: లంచ్​ సమయానికి ఆధిక్యంలో భారత్ - Ind vs Eng lunch time

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు భోజన విరామ సమయానికి టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఆట ప్రారంభమైన కాసేపటికే కోహ్లీ సేనకు ఎదురుదెబ్బ తగిలింది. రాబిన్సన్​ బౌలింగ్​లో పంత్​ క్యాచ్​ ఔట్​గా పెవిలియన్​ చేరాడు. కేఎల్ రాహుల్(77*), రవీంద్ర జడేజా(27*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 8 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమ్​ ఇండియా.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్

By

Published : Aug 6, 2021, 5:15 PM IST

Updated : Aug 6, 2021, 7:24 PM IST

నాటింగ్​హామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో లంచ్​ సమయానికి భారత్​ 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(77)​, రవీంద్ర జడేజా(27) ​ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​, రాబిన్సన్​ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

రూట్​ సేన

మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్​ పంత్​ వికెట్​ను కోల్పోయింది. 20 బంతుల్లోనే 25 పరుగులు చేసిన రిషభ్​.. రాబిన్సన్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా.. రాహుల్​కు సహకరించాడు. ఈ జోడీ ఆరో వికెట్​కు 46 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​ స్కోరును అధిగమించింది టీమ్ఇండియా. ప్రస్తుతం 8 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

వికెట్ తీసిన ఆనందంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు

వరుణుడి అంతరాయం..

ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మ్యాచ్​కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆటకు కొంతసేపు విరామం ప్రకటించారు. అనంతరం.. తిరిగి మ్యాచ్​ కొనసాగుతోంది.

ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 183 పరుగులకు ఆలౌటైంది. రూట్​(64) టాప్​ స్కోరర్​. బుమ్రా 4, షమీ 3 వికెట్లు తీశారు.

Last Updated : Aug 6, 2021, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details