తెలంగాణ

telangana

ETV Bharat / sports

Eng vs Ind: భారత్​కు ఆధిక్యం.. అండర్సన్​, జడేజా రికార్డులు - ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ స్కోర్

నాటింగ్​హామ్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్​కు 95 పరుగుల ఆధిక్యం లభించింది. కేఎల్​ రాహుల్​, జడేజా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ 4, రాబిన్సన్​ 5 వికెట్లతో రాణించారు. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 25/0తో ఉంది. మ్యాచ్​ మూడో రోజు కూడా వర్షం అంతరాయం కలిగించింది.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్

By

Published : Aug 6, 2021, 8:21 PM IST

Updated : Aug 6, 2021, 10:53 PM IST

నాటింగ్​హామ్​ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్​ మంచి స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో కోహ్లీ సేనకు 95 పరుగుల​ ఆధిక్యం లభించింది. టీమ్ఇండియాలో కేఎల్​ రాహుల్​(84), రవీంద్ర జడేజా(56) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ 4, రాబిన్సన్​ 5 వికెట్లు దక్కించుకున్నారు.

రాహుల్​-జడేజా అభివాదం

అనంతరం.. రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​ 11.1 ఓవర్లలో 25/0 స్కోర్‌ చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌(11), డామ్‌ సిబ్లీ(9) పరుగులతో క్రీజులో ఉన్నారు.

వర్షం అంతరాయం..

వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా అర్ధంతరంగా ముగిసింది. తొలుత భారత్​ బ్యాటింగ్​ ప్రారంభించిన వెంటనే వర్షం పడగా చాలా సేపు మ్యాచ్​ ఆగింది. అనంతరం.. ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​ సమయంలో వర్షం తీవ్రం కాగా మ్యాచ్​ను నిలిపివేశారు.

జడేజా, బుమ్రా దూకుడు..

191/5తో లంచ్​ విరామానికి వెళ్లిన కోహ్లీ సేన మరో 87 పరుగులు చేసి ఆలౌటైంది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రాహుల్​ను ఓ చక్కటి బంతితో పెవిలియన్​ పంపాడు అండర్సన్​. అప్పటికే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్​.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అనంతరం జడేజా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ భారీ షాట్​కు ప్రయత్నించి రాబిన్సన్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. చివర్లో బుమ్రా వరుస బౌండరీలతో ఆధిక్యాన్ని మరికొంచెం పెంచాడు.

అండర్సన్​ రికార్డు..

వికెట్ తీసిన ఆనందంలో రూట్​సేన

ఇంగ్లాండ్​ సీనియర్​ బౌలర్​ జేమ్స్​ అండర్సన్​ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్​గా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్​ అనిల్​ కుంబ్లేను (619 వికెట్లు) అధిగమించాడు. కేఎల్ రాహుల్​ వికెట్ తీసి జిమ్స్​ ఈ ఘనత సాధించాడు. ఈ ఫీట్​ చేరుకోవడానికి అతడికి 163 టెస్టులు అవసరమయ్యాయి. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్​ (800 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్​ దిగ్గజ బౌలర్​ షేన్ వార్న్​ (708 వికెట్లు) తర్వాత స్థానంలో ఉన్నాడు.

జడేజా సరికొత్త ఫీట్​..

ఈ మ్యాచ్​లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన జడేజా.. సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ టెస్టుల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఫీట్​ సాధించాడు. ఈ జాబితాలో ఇయాన్​ బోథమ్​ తొలి స్థానంలో ఉన్నాడు. ఇయాన్ కేవలం 42 టెస్టుల్లోనే ఈ ఘనత వహించాడు. ఆ తర్వాతి స్థానాల్లో కపిల్​ దేవ్​(50), ఇమ్రాన్​ ఖాన్(50), అశ్విన్​(51) ఉన్నారు.

జడేజా బ్యాటింగ్ విన్యాసం
Last Updated : Aug 6, 2021, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details