లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్ సందర్భంగా ఆతిథ్య జట్టు బౌలర్లు రాబిన్సన్, మార్క్ వుడ్ బంతిని కాలితో తొక్కుతూ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్లు కనిపించారు. బూట్ల స్పైక్‌తో బాల్‌ను అటు ఇటూ తన్నారు. బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించారు. దీనిపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆతిథ్య జట్టు ప్లేయర్ల తీరును తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని ముందుగా పసిగట్టిన టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ట్విట్టర్లో స్పందించాడు. "ఇండియా- ఇంగ్లాండ్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్?" అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు.
ఆ సమయంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షాన్ పొలాక్ కూడా ఈ అంశంపై అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ రిఫరీ ఈ విషయంపై దృష్టి సారించాల్సిందిగా కోరాడు. మరో వ్యాఖ్యాత హర్ష భోగ్లే దీనిని ఖండించారు. ఈ ఘటన అనంతరం అంపైర్లు బంతిని కూడా మార్చలేదు.