టీమ్ఇండియా-ఇంగ్లాండ్(team india england tour) మధ్య జరుగుతున్న సిరీస్లో ఇరు జట్ల పోరాట తీరు చూసి ముగ్ధుడయ్యాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. గతంలోనూ ఇరు జట్లు మైదానంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాయని అన్నాడు. ఈ సిరీస్కు ముందు ఆస్ట్రేలియా-టీమ్ఇండియా మధ్య ఉత్కంఠంగా జరిగిన సిరీస్ను గుర్తుచేసుకున్నాడు. రసవత్తరంగా సాగే ఇలాంటి టెస్ట్ సిరీస్లకు మించి ఇంకొకటి ఉండదని అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు అద్భత ప్రదర్శన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియాను ప్రశంసిస్తూ ఇలా అన్నాడు దాదా.
"ఇది ఉత్తమమైన క్రికెట్. పోటాపోటీగా సాగే ఇలాంటి టెస్టు సిరీస్కు ఏదీ సాటి రాదు. ఇది వరకు ఆస్ట్రేలియాలో.. ఇప్పుడు ఇక్కడ. అత్యంత నైపుణ్యమైన క్రికెట్ ఇది"
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.