యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట పూర్తయింది. ఆ సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే(2), హసీబ్ హమీద్(2) ఉన్నారు.
END Vs AUS: సెంచరీతో ఉస్మాన్ విజృంభణ.. ఇంగ్లాండ్ 13/0 - usman century
ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 403 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో జాక్ క్రాలే(2), హసీబ్ హమీద్(2) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖాజా(137) సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ENG Vs AUS
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 126/3తో రెండు రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఖాజా(137) సెంచరీ చేయడం వల్ల మరో 290 పరుగులు చేసి 416 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. మిగతా బ్యాటర్లు పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, రూట్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: ICC Women world cup 2022: భారత జట్టు ఇదే.. పాక్తో తొలి పోరు
Last Updated : Jan 6, 2022, 1:55 PM IST